‘జూపూడి’…బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాల్సిందే..!
1 min readమాజీ ఎమ్మెల్సీ జూపూడి చేసిన వివాదస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బ్రాహ్మణ సమాజం..
కర్నూలు: అధికార వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార సాధన బస్సు యాత్రలో మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ఎస్సీ.ఎస్టీ.సెల్ అధ్యక్షులు జూపూడి ప్రభాకర్ రావు బ్రాహ్మణుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కల్లే చంద్రశేఖర్ శర్మ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కోశాధికారి H.K. మనోహర రావు తీవ్రంగా ఖండించారు. ఆదివారం నగరంలోని సంకల్ భాగ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మనోహరరావు మాట్లాడుతూ.. కావలిలో బస్సు యాత్రలో.. బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడటమేకాకుండా… చెప్పులు కుట్టుకొనే వృత్తి ని కూడా అవమానించారని జూపూడి ప్రభాకర్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కల్లే చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ ప్రజల మధ్య, రాష్ట్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేల సాక్షిగా బ్రాహ్మణ కులం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జూపూడి ప్రభాకర్ రావు ఆంధ్ర బ్రాహ్మణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు ఇస్కాల సురేష్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యలను ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేకుంటే… వైసీపీ ప్రభుత్వానికి నష్టం చేకూరే ప్రమాదం లేకపోలేదన్నారు .జూపూడి ప్రభాకర రావు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు అధికార ప్రతినిధి హెచ్ కె రాజశేఖర రావు . ఈ కార్యక్రమం లో బ్రాహ్మణ సంఘం నాయకులు కే.జీ.ప్రభాకరరావు, పి. ఉమేష్, దుర్గాప్రసాద్, త్రినాథ్, కరణం పద్మనాభ రావు, దేవి ప్రసాద్, సుదర్శన్ రావు, గోవర్ధన్,సూర్యనారాయణ, అర్చకసంక్షేమసంగం టీవీరవిచంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.