నేటి నుండి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ శాఖ గ్రంధాలయంలో నేటి నుండి నుండి ఈనెల 20 వరకు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి రాంకుమార్ తెలిపారు. ఈ వారోత్సవాల సందర్భంగా పత్తికొండ పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ పోటీలు చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో విజేతలైన వారికి ఈ నెల20 న ముగింపు రోజు విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయబడతాయని గ్రంథాలయ అధికారి రామ్ కుమార్ తెలిపారు.ఈనెల 15న సీనియర్ విద్యార్థులకు భారతదేశ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ జూనియర్ విద్యార్థులకు సమాజంలో గ్రంథాలయాల పాత్ర విషయంపై వ్యాసరచన పోటీని, 16 న, సీనియర్ విద్యార్థులకు మన దేశ సంప్రదాయ పండుగలు జూనియర్ విద్యార్థులకు ప్రకృతి అందాలు అనే అంశంపై చిత్రలేఖనం పోటీ నిర్వహిస్తామని చెప్పారు. అలాగే 18వ తేదీన 8, 9, 10 వ తరగతి విద్యార్థులకు క్విజ్ పోటీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాలకు సంబంధించిన పోటీల కాపీని ఆయా పాఠశాలలకు సర్కులర్ ను జారీ చేసినట్లు తెలిపారు. కావున విద్యార్థిని విద్యార్థులు అందరూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఫీజు పోటీలలో పాల్గొని బహుమతులను గెలుపొందాలని గ్రంథాలయ అధికారి రామ్ కుమార్ కోరారు.