మృతుని కుటుంబానికి 2 లక్షల రూ. బీమా అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: జగనన్నకు తోడుగా పేద ప్రజలకు అండగా అనే నినాదంతో పోచిమిరెడ్డి రెడ్డి సేవాదళ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం తెలిసినదే.ఇందులో భాగంగా గత సంవత్సరం 21 డిసెంబర్ నుంచి జగనన్న జన్మదిన సందర్భంగా పోచిమిరెడ్డి సేవాదళ్ నందు సభ్యులైన ప్రతి కుటుంబానికి జగనన్న ప్రమాద భీమా కలిగి ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో డిసెంబర్ 21 తేదీ సేవాదంలోని అన్ని కుటుంబాలకు SBI GENERAL INSURANCE జగనన్న భీమాను కల్పించడం జరిగిందని కోచింగ్ రెడ్డి సేవాదన సంస్థ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి చెప్పారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ సేవాదళ్ కుటుంబ సభ్యులను ఆదుకుంటుందనే సదుద్దేశంతో ఇంటిలోని భార్యాభర్తకు ( ఇద్దరిలో ఎవరైనా ఒకరికి ప్రమాదం జరిగిన ) 2 లక్షల రూపాయల జగనన్న ప్రమాద బీమా అందజేయడం జరుగుతుందన్నారు. విధి మన చేతిలో ఉండదు, 08.05.2023 తేదీన కోతి రాళ్ల సమీపంలో ముస్లిం వీధిలోని కార్పెంటర్ హుస్సేన్ సాహెబ్ మోటార్ వెహికల్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి పోచిమిరెడ్డి సేవాదళ్ ఇన్సూరెన్స్ జగనన్న భీమా ఉన్నందున మృతుని కుటుంబానికి రెండు లక్షల రూపాయలు బీమా సౌకర్యం లభించిందని తెలిపారు. ఈ (13.11.2023 ) రోజు సాయంత్రం 05.30 ని. లకు MPDO ఆఫీసు వెనకాల మృతుడు హుస్సేన్ భార్యకు పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఎల్లవేళలా సేవాదళ్ కుటుంబ సభ్యులకు పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ సంస్థ అండగా ఉంటుందని పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి అన్నారు.