వ్యాక్సిన్ తీసుకున్నా.. కరోన పాజిటివ్
1 min readపల్లెవెలుగు వెబ్: వ్యాక్సిన్ తీసుకున్నా సరే అపోలో జేఎండీ సంగీతా రెడ్డి కరోన బారినపడ్డారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. అత్యంత జాగ్రత్తగా కరోన నిబంధనలు పాటించినా.. కరోన పాజిటివ్ రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె ట్వీట్ చేశారు. వ్యాధి నిర్ధారణ, చికిత్స రెండూ కీలకమైన విషయాలని ఆమె తెలిపారు. కరోన వల్ల విపరీతమైన జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరానని తెలిపారు. వ్యాక్సిన్ కరోనాను అడ్డుకోలేదని, కేవలం వ్యాధి తీవ్రం కాకుండా అడ్డుకోగలదని ఆమె ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నాక జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు.