56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు..
1 min readపాల్గొన్న స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పెదపాడు శాఖా గ్రంధాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభించుట జరిగినది. ఈ ప్రారంభోత్సవానికి అక్కినేని రాజశేఖర్ అధ్యక్షులు పెదపాడు విశాల సహకార పరపతి సంఘం, రెడ్డి స్వర్ణ కుమారి వైస్ ఎంపీపీ పెదపాడు, బి వంశీ మోహన్ కరస్పాండెంట్ శ్రీకృష్ణ గురుకులం పాఠశాల పెదపాడు, వేల్పుల ప్రభాకర్ ఎంపీపీ స్కూల్ హెచ్ఎం పెదపాడు, బెంజిమెన్ గురుకులం స్కూల్ హెచ్ఎం హాజరైనారు. ముందుగా బాలల దినోత్సవం సందర్భంగా భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటమునకు పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేసి గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించినారు. ఈ కార్యక్రమమునకు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు హాజరైనారు. వారికి మిఠాయిలు పంచిపెట్టడం జరిగినది. గ్రంథాలయ అధికారి జాన్ మాట్లాడుతూ ఈనెల 14 నుండి 20వ తారీకు వరకు జరుగు గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థిని విద్యార్థులు విరివిగా పాల్గొని గ్రంథాలయంలో నిర్వహించు వివిధ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలవాలని కోరినారు. ఈ కార్యక్రమం ఘనంగా విజయవంతం చేసి ప్రారంభించిన ఆహ్వానితులందరికీ కృతజ్ఞతలు తెలియజేసినారు.