సిద్ధార్థన్న కృషితో గ్రామాలు సర్వతో ముఖాభివృద్ధి
1 min read-చౌటుకూరు పల్లెకు పోదాంలో జగన్ మోహన్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: శాప్ చైర్మన్ మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రజా శ్రేయస్సు కోసం ఆయన అనునిత్యం కృషి చేస్తున్నారని అంతే కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకు వస్తున్నారని నంద్యాల జిల్లా ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు.మంగళవారం సాయంత్రం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో పల్లెకు పోదాం అనే కార్యక్రమం వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మదార్ సాహెబ్ అధ్యక్షతన జరిగినది.ముందుగా ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం అనేక పథకాలను ప్రజల మధ్యకు ముఖ్యమంత్రి తీసుకువచ్చారని అంతే కాకుండా కులమతాలకు అతీతంగా టిడిపి వారికి కూడా పథకాలు అందుతున్నాయ నడంలో చెప్పనవసరం లేదని ఆమె అన్నారు.తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధార్థ రెడ్డి అన్న ఎప్పుడూ కూడా ప్రజల బాగోగుల కోసం నిత్యం శ్రమిస్తూ ఉన్నారని అంతే కాకుండా గత టిడిపి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మరియు తేడా గురించి క్లుప్తంగా ప్రజలకు వివరించారు.గత ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు మరియు మరుగుదొడ్లు నిర్మించకుండానే టిడిపి నాయకులు బిల్లులు కాజేశారని అన్నారు.అప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖల్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని అన్నారు.విద్యార్థులు ఎవ్వరూ కూడా బడి బయట ఉండకూడదన్న ఉద్దేశంతోనే అమ్మ ఒడి పథకం తీసుకురావడం జరిగిందని అన్నారు.వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగనన్న వచ్చుటకు పథకాల గురించి ఇతరులకు తెలియజేయాలని ఆయన ప్రజలకు తెలియజేశారు.తదనంతరం పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ ఫక్రుద్దీన్,సహకార సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్,కడుమూరు శంకర్ రెడ్డి,అలగనూరు చిన్న రామ చంద్రారెడ్డి,తువ్వా రామ నాగేశ్వర రెడ్డి,మల్లేశ్వర రెడ్డి,పెద్ద మౌలా,గ్రామ వైసిపి సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి,ప్రతాప్,పంచాయితీ కార్యదర్శులు శివ కళ్యాణ్ సింగ్,బీజాన్ భీ తదితరులు పాల్గొన్నారు.