పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు.. ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా జగనన్న నవరత్నాలు ప్రజలకు అందజేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు బుధవారం నాడు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని (పెసర వాయ్ ) గ్రామంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్వహించారు కుల మతాలకు రాగద్వేషాలకు అతీతంగా వైసిపి ప్రభుత్వం పని చేస్తున్నట్టు ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధి తమ ఎజెండాగా గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తూ వాలంటీర్ల ద్వారా అవ్వ తాతలకు నేరుగా ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనన్నారు డిబీటి ద్వారా లబ్ధిదారుల అకౌంట్ కు నగదు బదిలీ చేస్తున్నామని వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు అనంతరం లబ్ధిదారులకు నవరత్నాల బుక్లెట్ అందజేసి ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎల్లారెడ్డి .శ్రీకాంత్ రెడ్డి . రాజారెడ్డి. సిరుప శ్రీనివాస్ రెడ్డి . మంచాల నిరంజన్ రెడ్డి. సర్పంచ్ వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.