PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి వైయస్ జగన్ తోనే రాష్ట్ర ప్రగతి

1 min read

మళ్లీ మరోసారి ముఖ్యమంత్రిగా జగనన్న ను ఆశీర్వాదించండి

ఇప్పుడు చరిత్ర అంటే.. 

జగన్ పాలనకు ముందు  జగన్ పాలనకు తర్వాత మాత్రమే.. వైయస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి 

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోని అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని చింతకొమ్మ దీన్నే జడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా రాజేంద్రప్రసాద్ రెడ్డి లు అన్నారు, బుధవారం వారు మండలంలోని ఉప్పరపల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు మారేళ్ల కాలంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగిందన్నారు, గతంలో ఎన్నడు లేని విధంగా వాళ్లకు, మతాలకు , పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు, ఇంత చేసిన ముఖ్యమంత్రిని మనమందరం ఆశీర్వదించాలని ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని వారు కోరారు, అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల సూచిక బోర్డులను ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ ప్రారంభించారు, శివాలపల్లెలో…. శివాల పల్లె గ్రామపంచాయతీలో సర్పంచ్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గ యువ నాయకులు నరేన్ రామాంజనేయులు రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, అభివృద్ధి, సంక్షేమం తో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనికోసం, ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసినప్పుడే మళ్లీ ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలరని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జీఎన్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, ఎర్ర సాని మోహన్ రెడ్డి, ఎంపీటీసీలు, నిరంజన్ రెడ్డి, దుంప నాగిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామ్ మూర్తి, అన్వర్ భాష, సాధిక్ అలీ, వారిష్, హస్రత్, సాదు కిషోర్, చంద్ర, సర్పంచులు ,ఎంపీటీసీలు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author