‘డ్వామా’..కంప్యూటర్ ఆపరేటర్లకు కౌన్సెలింగ్..
1 min readబదిలీ అయిన వారికి.. ఉమ్మడి జిల్లాలో విధుల కేటాయింపు..
- డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో
పల్లెవెలుగు:రేషనలైజేషన్‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కొద్ది నెలల క్రితం బదిలీ అయిన కంప్యూటర్ అపరేటర్లు, సాంకేతిక సహాయకుల్లో (టీఏ) పలువురిని గ్రామీణాభివృద్ధి శాఖ తిరిగి ఉమ్మడి కర్నూలు జిల్లాకు కేటాయించింది. ఉమ్మడి జిల్లాకు 92 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 140 మంది సాంకేతిక సహాయకులు రావడంతో వారికి కౌన్సెలింగ్ ద్వారా మండలాలు కేటాయించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా యూనిట్‌గా కర్నూలు జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం 92 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బుధవారం సాంకేతిక సహాయకులకు జిల్లా నీటియాజమాన్య సంస్థ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌లో డీఆర్డీఏ పీడీ ( నీటి యాజమాన్య సంస్థ ఏపీడీ), ఎన్.సలీంబాష తదితరులు పాల్గొన్నారు.