మెడికల్ అసోసియేషన్ భవనానికి స్థలం కేటాయింపు..
1 min read– ఎమ్మెల్యే ఆళ్ల నాని కి కృతజ్ఞతలు తెలియజేసిన అసోసియేషన్ సభ్యులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆళ్ల నాని ని గురువారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఏలూరు లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం కోరుతూ గత కొంతకాలం నుండి విజ్ఞప్తి చేస్తున్నారు. జూలై 15న చేసిన విజ్ఞప్తి మేరకు వారికి గ్రీన్ సిటీ లో స్థలం మంజూరు చేస్తున్నట్టు ఆళ్ల నాని ప్రకటించారు. తమ విజ్ఞప్తి పై సానుకూలంగా స్పందించిన ఆళ్ల నాని కి మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏలూరు శాఖ అధ్యక్షుడు డా.సదాశివ రావు, మెడికల్ బోర్డు డైరెక్టర్ డా.దిరిశాల వర ప్రసాద్, డా.విజయ్ మోహన్, డా.దామోదర్ రెడ్డి, డా.రవీంద్ర, డా:యం యల్ వి ప్రసాద్, డా. విశ్వేశ్వరరావు, డా.రమేష్ చంద్ర శేఖర్, డా.కృష్ణ భగవాన్, డా.సుబ్బారావు, డా.సాయి రామ్ ప్రసాద్, డా.ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు.