దత్తత తీసుకున్న బేబి వైదేహిని మంచి విద్యావంతురాలిగా తీర్చిదిద్దాలి..
1 min readజిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : దత్తతతీసుకున్న తల్లిదండ్రులు బేబీ వైదేహి ని బాగా చదివించి మంచి భవిష్యత్ కల్పించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ హితవు పలికారు. ఏలూరు శిశు గృహంలో ఉన్న 5 నెలల వయస్సు గల బేబీ వైదేహి ని స్థానిక కలెక్టరేట్ లో బుధవారం సాయంత్రం తిరుపతికి చెందిన సి. రామ సుబ్బారాయుడు, చంద్రకళ దంపతులకు జిల్లా మేజిస్ట్రేట్ మరియ జిల్లా కలెక్టర్, జిల్లా దత్తత అధికారి వారి సమక్షంలో దత్తత ఇవ్వడమైనది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ బేబీ వైదేహి కు ఆలనా పాలనతోపాటు మంచి విద్యనందించి విద్యావంతురాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. చట్ట ప్రకారం అన్ని అర్హతతో దత్తత అర్జీ దారులు 2019 సంవత్సరంలో ఆడ పిల్ల కోసం కొరకు దరఖాస్తు చేసుకోగా బుధవారం బేబీ వైదేహి ను దత్తత స్వీకరణ మార్గదర్శకాలకు అనుగుణoగా వారికి అప్పగించారు. సి. రామ సుబ్బారాయుడు స్విమ్స్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తుండగా వారి భార్య ఏసిడిపిఓ గా పనిచేస్తున్నారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారాతధికారి కె. పద్మావతి, డి.సి.పి.ఓ. సిహెచ్. సూర్య చక్ర వేణి, బాలల రక్షణాధికారి ఆర్. రాజేష్, అవుట్ రీచ్ వర్కర్ భార్గవి పాల్గొన్నారు.