సచివాలయాల పనితీరును పరిశీలించిన కేంద్ర బృందం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్ శిక్షణ అధికారుల బృందం గురువారం మండలం లోని బ యన పల్లె గ్రామ సచివాలయము గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది, అక్కడ పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో వారు సమావేశమయ్యి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారో ఆ పథకాలన్నీటిని విడివిడిగా అడిగి తెలుసుకున్నారు, అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వారు దగ్గర ఉండి పరిశీలించారు, ప్రయోగాత్మకంగా ఉపాధి హామీ పథకం ద్వారా సాగుచేసిన డ్రాగన్ ఫ్రూట్ పంట పరిశీలించారు, అలాగే ఈ పంట గురించి ఉపాధి హామీ సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు, మానస సరోవర్ చెరువును పరిశీలించినవారు అనంతరము చెత్త నుండి సంపద తయారీ కేంద్రమును దాని యందు గల వ్యవసాయ ఉద్యానవనమును పరిశీలించడమైనది, అంగన్వాడీ కేంద్రంలో ప్రాథమిక పాఠశాలను సందర్శించి నాడు-నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు కేంద్ర ప్రభుత్వ బృంద సభ్యులు రోహిత్, భరత్ బ్రిజేష్ ,సతీష్, రోహిత్ వీరితోపాటు డీఎల్ పి ఓ మస్తాన్ వలి డిఎల్పిఓ బద్వేల్ రమణ రెడ్డి, కోఆర్డినేటర్ అధికారి ,కోఆర్డి నేషన్ సురేష్ కుమార్ , మండల విస్తరణ అధికారి సురేష్ బాబు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ లు పాల్గొన్నారు.