జగనన్న విద్యా దీవెనకు కేడీసీసీ బ్యాంక్ ఖాతాల
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల, కళాశాల విద్యార్థిని, విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేడీసీసీ బ్యాంక్ లో బ్యాంక్ ఖాతాలు ప్రారంభిస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ రాజు వెల్లడించారు. ఈ మేరకు గురువారం బ్యాంక్ ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులు సేవింగ్స్ ఖాతా కోసం బ్యాంక్ ల చుట్టూ తిరగవలసిన అవసరం లేదన్నారు. బ్యాంక్ ఖాతా ఓపినింగ్ కోసం వచ్చే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించామన్నారు. అకౌంట్ కోసం వచ్చిన వారికి గంటలోగా ఖాతా తెరుస్తామన్నారు. ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన ఖాతాలో జమయిన వెంటనే సెల్ ఫోన్ కు సమాచారం వస్తుందన్నారు. కేడీసీసీ కల్పించిన ఈ సదవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ ఫీల్డ్ ఆఫిసర్ రసూల్ పాల్గొన్నారు.