PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గెలిచాక  ఒకటిన్నర సెంటు పట్టాలు ప్రజలకు ఇచ్చి తీరుతాం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: గెలిచాక ఎట్టి పరిస్థితుల్లో ఒకటిన్నర సెంటు పట్టాలు ప్రజలకు ఇచ్చి తీరుతాం అని డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి అని తెలిపారు.శుక్రవారం  ప్యాపిలి లో విలేఖర్ల సమావేశంలో ఒకటిన్నర సెంటు స్థలం పై ఇన్ని పట్టాలు ఎలా ఇస్తారన్నా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసున్న వ్యాఖ్యలపై డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి  మాట్లాడుతూ…మేము మా కుటుంబంతో కలిసి ఒకటిన్నర సెంటు స్థలం తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం వచ్చి , డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ గెలిచిన వెంటనే  ఇవ్వాలని నిర్ణయించుకున్న తరువాతనే ప్రకటించడం జరిగిందనీ అన్నారు. గతంలో నాయకుల అండతో కేవలం డోన్ పట్టణంలోనే 5వేల పట్టాలు ఇవ్వడం జరిగిందని. డోన్ నియోజకవర్గ ప్రజలు ఆర్థికమంత్రి బుగ్గన ను, అయిన చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, చేతనైతే వారి ప్రభుత్వం ఉంది ఇవ్వాలి కానీ, ఇచ్చే వారని ఇవ్వకుండా చేయుటకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. డోన్, ప్యాపిలి లో వేసిన రోడ్డులో డివైడర్ లు పెద్దగా వేసి చిరు వ్యాపారస్తులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారని, బేతంచేర్లలో బుగ్గన మరియు వారి బంధువుల ఆస్తులు ఉన్నాయని రోడ్డు వెడల్పు తగ్గించి డివైడర్ ను చిన్నగా వేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా మా తాత శేషారెడ్డి హైస్కూల్ ను దానంగా ఇచ్చాడని చెప్పి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచెర్లలోని శేషారెడ్డి హైస్కూల్ ఎడెడ్ నుండి వెనక్కి తీసుకున్నా నిజం కాదా… దీనికి ఇంత వరకు సమాధానం లేదని డోన్ నియోజకవర్గ ప్రజలు ఇక నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాపిలి పట్టణ టిడిపి అధ్యక్షులు భూశెట్టి సుంకయ్య , నంద్యాల జిల్లా టిడిపి బీసీ సెల్ అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవ్ , పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పెద్దాపూజర్ల ప్రసాద్ రెడ్డి ,పోతిరెడ్డి రజని, నంద్యాల జిల్లా మైనారిటీ కమిటి ప్రధాన కార్యదర్శి ఖాజా పీరా, బీసీ సెల్ కమిటీ నాయకులు నాగేంద్ర , గండికోట రామాంజినేయులు ,మల్లికార్జున, కొంగనపల్లి మధు, బాలిరెడ్డి,మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author