ప్రజలు ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
1 min read– రిజర్వు ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు.
పల్లెవెలుగు వెబ్ కృష్ణ: ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకే, శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని,ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహించడమే లక్ష్యం అని RI శేఖర్ బాబు తెలిపారు. కృష్ణ మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన గుడేబలూరు, ముడుమల్ గ్రామాలలో జిల్లా పోలీసులు కేంద్రం సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా RI శేఖర్ బాబు మాట్లాడుతూ…అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మరియు ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని అలాగే ప్రజలందరికీ జిల్లా పోలీసులు ఎల్లవేళలా తోడుంటారని ప్రజల్లో ధైర్యాన్ని కల్పించడానికి ప్లగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అలాంటి వారిని ప్రతి గ్రామంలో ముందస్తు గుర్తించి బైండోవర్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో SI విజయ్ భాస్కర్, ASI సురేందర్ బాబు, కేంద్ర సాయుధ బలగాలు, పోలీసు సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.