భూమి లేని నిరుపేదలకు భూహక్కు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
1 min read– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భూమి లేని నిరుపేదలకు భూహక్కు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం భూపట్టాలు పంపిణీ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు.శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడు నుండి భూములు లేని నిరుపేదలకు భూపంపిణీ….భూములపై సర్వ హక్కులు కల్పిస్తూ భూమి లేని దళిత, బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు..ఇప్పటికే అసైన్డ్, గ్రామ సర్వీస్ ఇనామ్, ఎస్సీ కార్పొరేషన్ (LPS) భూములు పొందిన వారికి వాటిపై సర్వ హక్కులు కల్పిస్తూ భూ యాజమాన్య హక్కు పత్రాల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,24,709 మందికి లబ్ధి చేకూరుస్తూ 35,44,866 ఎకరాల భూములను నేడు లాంఛనంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, నగర మేయర్ బివై.రామయ్య, కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్, డిఆర్ఓ కె.మధుసూదన్ రావు, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్ తదితరులు వీక్షించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు చేయూతను అందించాలనే దృఢ సంకల్పంతో భూములు లేని పేదలకు డిపట్టాల ద్వారా వారికి భూములు అందజేయడం జరిగిందన్నారు. ఫ్రీహోల్డ్ అసైన్‌మెంట్ భూములకు సంబంధించిన వాటికి అసైన్మెంట్ ఇచ్చి ఉంటే వారికి ఫ్రీహోల్డ్ హక్కులు కల్పిస్తూ 22(ఎ) నుంచి వారి తొలగిస్తూ వారికి పూర్తి హక్కులు కల్పించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా గ్రామ సర్వీస్ ఇనామ్‌లకు సంబంధించిన భూములను 22(ఎ) నుంచి తొలగించారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ వారు ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద మార్టిగేజ్ చేసుకున్న భూములను లబ్ధిదారుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి వారికి అందజేయడం జరిగిందన్నారు. ఎస్సీ కమ్యూనిటీకి వారికి పడుతున్న ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి అందజేరన్నారు. అంతేకాకుండా సర్వే చేసి గ్రామ కంఠం భూములకు సంబంధించిన ప్రాపర్టీ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.నగర మేయర్ బివై.రామయ్య మాట్లడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల భూమి లేని నిరుపేదలకు పట్టాలు ఇవ్వడం వల్ల వారికి ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. రైతులు ఈ భూములలో పంట వేసుకొని లబ్ధి పొందాలని వారు ఆకాక్షించారు. కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన రైతులు చాలా వరకు ఇతరుల పంట పొలాలను గుత్తకు తీసుకొని వ్యసాయం చేసుకునే వారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పంపిణీ చేసిన ఈ భూముల ద్వారా వారు కూడా సొంతంగా భూములు కలిగి యాజమాన్య వారికి వర్తింపజేసేలా చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఎస్సీ కుటుంబాలకు స్మశాన వాటికలు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.భూపట్టాల పంపిణీ వివరాలుభూమి లేని నిరుపేదలకు ఆదోని డివిజన్ లో 1330 మంది లబ్దిదారులకు – 1375.45 ఎకరాలు, పత్తికొండ డివిజన్ లో 932 మంది లబ్దిదారులకు – 1203.99 ఎకరాలు, కర్నూలు డివిజన్ లో 320 మంది లబ్ధదారులకు – 422.74 ఎకరాల) కొత్త డి పట్టాలను పంపిణీ ఈ విధంగా జిల్లాలో ఉన్న 2582 మంది లబ్దిదారులకు 3002.18 ఎకరాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఫ్రీహోల్డ్ అసైన్‌మెంట్ భూములకు సంబంధించి ఆదోని డివిజన్ లో 484 మంది లబ్దిదారులకు – 702.71 ఎకరాలు, పత్తికొండడివిజన్ లో 2277 మంది లబ్ధదారులకు – 4540.57 ఎకరాలు, కర్నూలు డివిజన్ లోల 342 మంది లబ్ధదారులకు – 538.095 ఎకరాలకు ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించడం ద్వారా 3103 లబ్ధిదారులకు 5781.375 ఎకరాల లబ్ధి జరిగిందన్నారు. గ్రామ సర్వీస్ ఇనామ్‌లకు 22(ఎ) నుంచి తొలగించడానికి సంబంధించి ఆదోని డివిజన్ లో 3328 మంది లబ్దిదారులకు – 5390.78 ఎకరాలు, పత్తికొండ డివిజన్ లో 2889 మంది లబ్దిదారులకు – 5944.00 ఎకరాలు, కర్నూలు డివిజన్ లో 8974 మంది లబ్దిదారులకు – 12,504.14 ఎకరాలు సర్వీస్ ఇనామ్ తొలగించడం ద్వారా 15191 మంది లబ్ధిదారులకు 23,838.92 ఎకరాలు లబ్ధి జరిగిందన్నారు.ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద మార్టిగేజ్ చేసుకున్న భూములను జిల్లాలో 1762 మంది లబ్దిదారులకు 2794 ఎకరాల్లో వారికి రిజిస్ట్రేషన్ చేసి వారికి సొంత హక్కులు కల్పించడం జరుగుతోందన్నారు.ఎస్సీ కమ్యూనిటీ వారికి స్మశాన వాటికలు గుర్తించామని అందులో ఆదోని డివిజన్ లో 34 మంది లబ్దిదారులకు – 18.52 ఎకరాలు, పత్తికొండ డివిజన్ లో 66 మంది లబ్ధదారులకు – 34.29 ఎకరాలు, కర్నూలు డివిజన్ లో 3 మంది లబ్ధదారులకు – 1.96ఎకరాలు మొత్తంగా 103 లబ్ధిదారులకు 54.77 ఎకరాలు మేరకు మంజూరు చేయడం జరిగిందన్నారు.అనంతరం జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, నగర మేయర్ బివై.రామయ్య, కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస కుమార్, కల్లూరు తహశీల్దార్ రమేష్ బాబు, కోడుమూరు తహశీల్దార్ జయన్న తదితరులు పాల్గొన్నారు.