NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌గ‌న్ కీల‌క నిర్ణయం.. డిగ్రీలో తెలుగు మీడియం ఉండ‌దు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఏపీలో డిగ్రీలో తెలుగు మీడియం ఇక ఉండ‌దు. 2021-22 విద్యాసంవ‌త్సారానికి తెలుగు మీడియం ఏపీలో మూత‌ప‌డ‌నుంది. కాలేజీల‌న్నీ పూర్తీగా ఇంగ్లీషు మీడియంలోకి మార‌నున్నాయి. ఉన్నత విద్య పై ఫిబ్రవ‌రి 2న సీఎం జ‌గ‌న్ మోహన్​ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేర‌కు రాష్ట్రంలో కాలేజీల‌న్నీ ఇంగ్లీషు మీడియంలో నిర్వహించాల‌ని ఉన్నత విద్యా మండ‌లి ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియంలో కోర్సులు నిర్వహిస్తున్న మీడియం మార్పున‌కు ఈనెల 18 నుంచి 28 వ‌ర‌కు ప్రతిపాద‌న‌లు స‌మ‌ర్పించాల‌ని ఉన్నత విద్యా మండ‌లి కోరింది. ప్రతిపాద‌న‌లు స‌మ‌ర్పించక‌పోతే కోర్సులు నిర్వహించేందుకు అనుమ‌తి ఉండ‌ద‌ని ఉన్నత విద్యామండ‌లి పేర్కొంది.

About Author