PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐటీ డిఎం సంస్థకు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు

1 min read

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి  వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన…

పల్లెవెలుగు వెబ్  కర్నూలు : జగన్నాథగట్టు పై ఉన్న ఐఐఐటిడిఎం (IIITDM) సంస్థ కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన   రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి  వివరించారు.శుక్రవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్  లో  జగన్నాథ గట్టుపై ఉన్న  ట్రిపుల్ ఐటీ డిఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ & మ్యానుఫ్యాక్చరింగ్)కు అవసరమైన మౌలిక సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె .ఎస్. జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…3.72 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రధాన రహదారి నుండి ట్రిపుల్ఐటీ డిఎం సంస్థ వరకు నిర్మిస్తున్న రహదారిని  డిసెంబర్ డిసెంబర్ నెల 15  తేదీ లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.అలాగే రూ.22 కోట్ల వ్యయంతో   త్రాగు నీటికి సంబంధించి శాశ్వతమైన నీటి సరఫరా ఏర్పాటు చేయడం జరుగుతోందని,  అప్పటి వరకు తాత్కాలికంగా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో బోర్ వెల్స్ తవ్విస్తున్నామన్నారు. సంస్థ భవన సముదాయం మీదుగా వెళ్లే  హై టెన్షన్ విద్యుత్ లైన్లు మార్చేందుకు రూ.17 కోట్ల పనులకు  రెండు మూడు రోజుల్లో ఆర్థిక శాఖ నుండి అనుమతులు  వచ్చిన తరువాత  విద్యుత్ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు…సంస్థ ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి రూ.12.4 కోట్లకు టెండర్లు ఆర్ అండ్ బీ శాఖ ద్వారా పిలవడం జరిగిందని, ఇవి త్వరలో ఫైనల్ అవుతాయని, ఆ వెంటనే పనులు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అప్రోచ్ రోడ్డు వెంట వీధి లైట్ల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని  కలెక్టర్ వివరించారు. సమీక్ష సమావేశంలో  ట్రిపుల్ ఐటీ డి.ఎం  డైరెక్టర్ సోమయాజులు, విజయానంద్  (కన్సల్ టెంట్ , ఐ.టి.డి.ఎం),ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు, ఆర్డబ్లూఎస్ ఎస్ఈ నాగేశ్వర రావు, విద్యుత్ శాఖ ఎస్ ఈ రామకృష్ణ, పంచాయతీ రాజ్ డి ఈ శ్రీనివాసులు , తదితరులు  పాల్గొన్నారు.

About Author