NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బైక్ బొలేరో ఢీ ఇద్దరికీ గాయాలు

1 min read

– గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయండి

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామ సమీపంలో రెండు వాహనాలు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికులు తెలిపిన వివరాల మేరకు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పలదడియ గ్రామ సమీపంలో దిగువపాడు రహదారిలో ఉన్న బోడెన్న సమాధి మలుపు దగ్గర కలమందలపాడు గ్రామానికి చెందిన వడ్డే అంజి(18),పల్లె మోహన్ రెడ్డి(35)వీరిద్దరూ ద్విచక్రవాహనంపై పొలానికి వెళ్తుండగా కర్నూలు నుండి వస్తున్న బొలెరో వాహనం రెండూ మలుపు దగ్గర ఢీకొన్నాయి.వెంటనే కింద పడ్డ ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయని రోడ్డు మార్గాన వెళ్తున్న వారు చూసి 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కొరకు తరలించినట్లు రెండు వాహనాలు ఢీ కొన్న తర్వాత బొలెరో వాహనం ఆపకుండా వెళ్లారని స్థానికులు తెలిపారు.ఈ మలుపు దగ్గర రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని మలుపుల  దగ్గర ఉన్న ముళ్ల పొదలను తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అంతే కాకుండా గ్రామాల్లో ప్రధాన రహదారుల్లో సంబంధిత అధికారులు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.బొలెరో వాహనం మిడుతూరు పోలీస్ స్టేషన్ లో ఉందని ప్రమాదంలో గాయపడ్డ యువకులు ఫిర్యాదు చేస్తే మరిన్ని వివరాలు విచారణలో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

About Author