జగన్ తోనే సామాజిక సాధికారత సాధ్యం..
1 min readస్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పష్ఠీకరణ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్ర అభివృద్ధి తో పాటు సామాజిక సాధికారత జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పష్టం చేశారు. వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా శనివారం స్థానిక గుత్తి సర్కిల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు వైఎస్ఆర్సిపి రాష్ట్ర నేతలు హాజరైన ఈ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా నవరత్నాల అమలు వందకు వందశాతం అమలు చేసిన ఘనత వైఎస్ఆర్సిపి కి దక్కిందని అన్నారు. సామాజికపరంగా అన్ని కులాల ప్రజలు సర్వతో ముఖాభివృద్ధికి జగన్ పాలన అద్దం పడుతుందని తెలిపారు. పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి అంకితభావంతో సహకారం అందిస్తున్నారని తెలిపారు పత్తికొండ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి తన గుండెల్లో పెట్టుకొని అభివృద్ధికి దోహదపడుతున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గంలోని 64 చెరువులకు హంద్రీనీవా నుండి నీటిని మళ్లించేందుకు పైపులైన్లను వేసి పనులు పూర్తి చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అన్ని విధాల తోడ్పాటు అందించామని పేర్కొన్నారు. పత్తికొండ మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా పదివేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు పూర్తి చేశామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగిస్తున్నారని శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ తెలిపారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్సిపి నవరత్నాల ద్వారా అనేక పథకాలను ప్రజలకు చేరువయ్యేలా పాలన కొనసాగుతుందని ఆమె చెప్పారు. ఎస్సీ, బీసీ మైనార్టీల సంక్షేమం, సర్వతో ముఖాభివృద్ధికి వైఎస్ఆర్సిపి కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ సీపీకి మద్దతు తెలిపాలని ఆమె కోరారు. మొదట స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి వైఎస్ఆర్సిపి శ్రేణులు భారీ ర్యాలీతో బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి పార్టీ అగ్ర సేని నాయకులు బస్సు యాత్రలో పాల్గొని, బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు బివై రామయ్య, మాజీ ఎంపీ బుట్టా రేణుక, కార్మిక శాఖ మాత్యులు గుమ్మనూరు జయరాం, మంత్రులు ఆదిమూలపు సురేష్, విడదల రజని, ఆదోని, మంత్రాలయం శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి, బాల నాగిరెడ్డి తో పాటు స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు నాగరత్నమ్మ, శ్రీరంగడు, జిట్టా నాగేష్, ఎంపీపీ నారాయణ దాసు, జి సోమశేఖర్, మల్లికార్జున, మురళి, కారం నాగరాజు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.