విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: క్విజ్ పోటీలు విద్యార్థిని విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని పత్తికొండ శాఖ గ్రంథాలయ అధికారి రామ్ కుమార్ తెలిపారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక శాఖ గ్రంథాలయంలో విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు .ఈ పోటీలకు 8, 9, 10వ తరగతి సెయింట్ జోసెఫ్ స్కూల్, ప్రభుత్వ బాలికల పాఠశాల బాలుర పాఠశాల విద్యార్థులు మొత్తం 26 మంది పాల్గొన్నారు. ఈ క్విజ్ పోటీలు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు చిన్నారావు, అమీనాభి, నారాయణ పర్యవేక్షణలో నిర్వహించారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విరివిగా పాల్గొని తమ ప్రతిభను చాటాలని శాఖ గ్రంథాలయ అధికారి రామ్ కుమార్ ఈ సందర్భంగా సూచించారు. గ్రంథాలయంలో సభ్యులుగా చేరి గ్రంథాల పఠనం ద్వారా విజ్ఞానాన్ని సముపార్జించాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో పాఠకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.