దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం..
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని రామనపల్లె దళిత కాలనీ లో భూమన సుబ్బరాయుడు మరణించడం జరిగింది , ఈ విషయాన్ని గ్రామస్తులు అంబేద్కర్ సేవా సమితి కమిటీ సభ్యులకు తెలియజేయగా వారు వెంటనే స్పందించి మృతురాలి దహన సంస్కారాల కొరకు అంబేద్కర్ సేవా సంఘం తరపున మృతురాలి బంధువులకు శని వారం రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది, ఈ సందర్భంగా అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షులు గురయ్యా మాట్లాడుతూ, నిరుపేదలు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారి ఆపత్కాల సమయంలో అంబేద్కర్ సేవా సంఘం వారికి వెన్నంటి ఉండి , అన్ని విధాల ఆదుకోవడమే కాకుండా, ఎలాంటి సమస్య ఎదురైనా ఎల్లవేళలా అందుబాటులో ఉండడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షులు తంగేళ్ల గురయ్యా మరియు సెక్రెటరీ పెంచలయ్య కోశాధికారి వెంబడి బ్రహ్మం మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.