మత్స్యకారుల సంక్షేమ సంఘం కార్తీక వనభోజన మహోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మధ్యాహ్నం గడ్డ జమ్మి చెట్టు నందు ఏర్పాటు చేసిన ఏపీ కర్నూలు సిటీ సాంప్రదాయ మత్స్యకారుల సంక్షేమ సంఘం (తెలుగు-బెస్తా-గంగపుత్ర) కార్తీక వనభోజన మహోత్సవము కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కి సంఘం పెద్దలు శాలువా మరియు బొకేలతో సన్మానించి మెమెంటో అందజేశారు. ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ జగనన్న పరిపాలన గురించి మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, బడుగు బలహీనవర్గాలకి ప్రతి ఒక్కరికి సామాన్యంగా ఉన్నంత పదవులు అందించి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన ఏకైక మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. తెలుగు బెస్త కార్పొరేషన్ చైర్మన్ లు, డైరెక్టర్లు,పదవులు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ అన్న అన్ని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమం లో 9వ వార్డ్ కార్పొరేటర్ పుల్లమ్మ , నవీన్ , హకీమ్ , నవీద్ , సంగం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.