PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజ్ఞానాన్నిపంచే  బాండాగారాలు గ్రంథాలయాలు..

1 min read

విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకోవాలి.

నందికొట్కూరు సబ్ జైలు సూపర్ డెంట్  మల్లయ్య.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  పుస్తకం పఠనం వార్తాపత్రికలు చదవడం వలన విజ్ఞానవంతుల వుతారని, విజ్ఞానాన్ని పంచే బాండాగారాలు గ్రంథాలయాలని నందికొట్కూరు సబ్ జైలు సూపర్ డెంట్   మల్లయ్య అన్నారు.సోమవారం  పట్టణంలో  56 జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీ పరీక్షలు నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.  గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం గ్రంధాలయ అధికారి  మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నందికొట్కూరు సబ్ జైలు సూపర్ డెంట్   టి.మల్లయ్య ,ప్రభుత్వ బాలుర జడ్పీ పాఠశాల తెలుగు ఉపాద్యాయులు శంకర్ నాయక్ , సోషల్ ఉపాద్యాయులు  సత్యమయ్య స్కూల్ అసిస్టెంట్ సోషల్, ప్రభుత్వ బాలికల జడ్పీ పాఠశాల వ్యాయమ ఉపాద్యాయురాలు   విజయ కుమారి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతీ నిలయాలు గ్రంథాలయాలన్నారు.ఇక్కడ విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకుని ఉన్నత శిఖరాలకు చేరిన వారెందరో ఉన్నారని,కంప్యూటర్‌ యుగంలో కూడా పుస్తక పఠనంపై యువత మొగ్గు చూపుతున్నారన్నారు.ఇంటర్నేట్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ విషయమైన నెట్‌లో సెర్చ్‌ చేస్తే సమాచారం  సులువుగా దొరుకుతుంది  కానీ, పుస్తక పఠనంతో  విజ్ఞానం, సంతృప్తి కలుగుతుందన్నారు.కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

About Author