PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిసెంబర్  3 న ” కురువ “ల కార్తీక వనభోజనము

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో కురువ ల  కార్తీక వనభోజనం నిర్వహిస్తున్నామని జిల్లా గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న ,జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు ,ఎం .కే .రంగస్వామి ,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ,లు తెలిపారు.మంగళవారం  సంఘం కార్యాలయంలో జరిగిన కార్యవర్గ  సమావేశం లో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ కురువ సంఘం ఆద్వర్యం లో గత  20  సంవత్సరాలుగా కార్తీకవనభోజనాలు ఏర్పాటు  చేశామని చెప్పారు డిసెంబర్ 3 న జరిగే కార్తీక వనభోజన కార్యక్రమం పెద్దపాడు రోడ్ లోని మోడల్ స్కూల్ పక్కన శ్రీ బీరలింగేశ్వర స్వామి గుడి ఆవరణం లో ఏర్పాటు చేశామని ,ఈ కార్యక్రమము  నకు    జిల్లా లోని వివిధ మండలాల నుండి  కమిటీ సభ్యులు,సర్పంచులు ,కౌన్సిల్లర్లు,కార్పొరేటర్లు ,MPTC ,ZPTC లు కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు మరియు  కర్నూలు నగరం లోని కులజులందరు కుటుంబ సమేతంగా హాజరు కావలెనని పిలుపునిచ్చారు .చిన్నారులకు ,మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు .అనంతరం వనభోజనం నకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు .ఈ సమావేశం లో జిల్లా ఉపాధ్యక్షులు బిల్డర్ వెంకటేశ్వర్లు ,పెద్దపాడు ధనుంజయ ,కోశాధికారి కే.సి .నాగన్న ,సహాయ కార్యదర్సులు బి .సి తిరుపాల్ ,కే .దేవేంద్ర ,నగర అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ,కే .రాజు ,,బిల్డర్ శ్రీరాములు ,కే .నాగయ్య పెద్దపాడు పుల్లన్న ,కే .హరిదాసు కే .దివాకర్,కే .చిన్న ,కే .రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు .

About Author