NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విస్తరణ అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు

1 min read

– డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో విస్తరణ అధికారులకు, ఎంపిక చేయబడిన పంచాయతీ కార్యదరులకు, సర్పంచులకు  ఒకరోజు శిక్షణ తరగతులు కార్యక్రమం నవంబర్ 20, సోమవారం నిర్వహించనున్నామని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. శిక్షణ తరగతులలో సిబ్బందికి గ్రామ పంచాయతీ పరిపాలన మరియు ఆర్ధిక వ్యవహారలపై అవగాహన కల్పించనున్నామని డీపీఓ తెలిపారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహ సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ సుమారు 120 మంది పాల్గొను ఈ కార్యక్రమంలో తప్పక హాజరు నమోదు చెయ్యాలని, భోజన వసతి కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డి.యల్.పి.ఓలు చంద్రశేఖర్, రాజవుల్లాహ్, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ ప్రెసింగ్ రాజు, సీనియర్ సహాయకులు కిషోర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author