ఇంటర్, పది పరీక్షల పై మంత్రి ప్రకటన..ఎప్పుడంటే ?
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యా శాఖ యోచిస్తోంది. జులై మొదటి వారంలో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సీఎం జగన్ తో చర్చించి పరీక్షల నిర్వహణ మీద తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాల కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.