సంక్షేమ సారథి ముఖ్యమంత్రిని మరోసారి ఆశీర్వదించండి
1 min read– బిలేకల్లు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం..
– మంత్రి తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్..
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఈ రోజు సాయంత్రం ఆస్పరి మండలంలోని బిలేకల్లు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించి సచివాలయం పరిధిలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేసిన సంక్షేమ పథకాల డిస్ ప్లే బోర్డును,పార్టీ జెండాను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.అనంతరం జరిగిన సమావేశంలో లబ్దిదారులైన మహిళలతో మాట్లాడి వారికి ముఖ్యమంత్రిఅందచేసిన సంక్షేమ పథకాలను గురించి తెలుసుకుని జగనన్న ప్రభుత్వాన్ని మరియు మన మంత్రి గుమ్మనూరు జయరాప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరడం జరిగింది. ఈ గ్రామ సచివాలయ పరిధిలో ఈ నాలుగున్నరేళ్లలో నేరుగా పేద ప్రజలకు డీబీటీ,నాన్ డీబీటీ ద్వారా రూ.25 కోట్లు అందాయన్నారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా,పేద ప్రజల జీవితాలు బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి మరియు ఆలూరుకి మన మంత్రి,నాన్న గుమ్మనూరు జయరాం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్,ఆస్పరి ఎంపిపి సుంకర రామాంజనేయులు, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, మండల జెసిఎస్ కన్వీనర్ బసవరాజు, ఆస్పరి మండల కన్వీనర్ పెద్దయ్య, ఆస్పరి సొసైటీ సీఈవో అశోక్, హనుమంత రెడ్డి,బిలేకల్ ఎంపీటీసీ సుంకలమ్మ, నాగరాజు,శివమూర్తి, ఆస్పరి ఎంపిటిసి తిమ్మప్ప, ప్రకాష్, రాధాకృష్ణ నాయుడు, కౌలిట్ల ,వేణు, బత్తిని జీవన్ కుమార్,రాజన్న,డీలర్ సోమన్న,మల్లయ్య, విజయ్ కుమార్, బాలరాజు ,శ్రీరాములు, గఫూర్, విరేష్ వర్మ, మైబు,రంగన్న, చంద్ర ,రాజు, నరసింహులు,కన్నా,లక్ష్మన్న ఎల్లప్ప, ఖాసీం మరియు ప్రభుత్వ అధికారులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.