ఉర్దూ స్కూల్లో ఫిట్ ఇండియా వారోత్సవ సాంప్రదాయ క్రీడలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఫిట్ ఇండియా వారోత్సవాల్లో భాగంగానగరంలోని ప్రభుత్వ బాలుర ఉర్దూ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించారు. భారత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా ఉర్దూ స్కూల్ బాల బాలికలకు గిల్లిదండ,తొక్కుడు బిల్ల,ఉప్పర పట్టి,బారకట్ట,అర్చచన గాయలు,తదితర సాంప్రదాయక్రీడాంశాలుఫిజికల్ డైరెక్టర్ విజయ కుమార్ నేత్రతృత్వంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు పుష్పరాజు మాట్లాడుతూ వారం రోజులపాటు నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా తమ పాఠశాలలో విద్యార్థులకు సాంప్రదాయ క్రీడాపోటీలను నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొనడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రెహనా బేగం,అబ్దుల్ సుకుర్,తాజుద్దీన్ ,జాకీర్ హుస్సేన్ ,రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.