మిగిలి పోయిన కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టండి…
1 min readజిల్లా జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో మిగిలి పోయిన క్రొత్త ఓటర్లను నమోదు చేయించ వలసిందిగా రాజకీయ పార్టీ ప్రతినిధులను జిల్లా జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య కోరారు.బుధవారం సాయంకాలం జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్ లో పాణ్యం నియోజకవర్గ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులను పోలింగ్ స్టేషన్ల ను పరిశీలించి , పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన మరియు ఓటరు ముసాయిదా జాబితా లో ఉన్న తప్పులు , సమస్యల గురించి తెలుప వలసిందిగా కోరారు. ఈ సందర్భంగా కరిమద్దల గ్రామంలో (గడివేముల మండలం ) పోలింగ్ స్టేషన్ కు వెళ్లుదారి చాలా ఇరుకుగా ఉందని దాన్ని మార్చాలని మరియు కల్లూరు మండలం చెన్నమ్మ సర్కిల్లో ఒక వార్డు ఓటర్లు వేరొక వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ కు హైవే 44 దాటుకుని వెళ్ళవలసి ఉన్నదని దాన్ని కూడా మార్చాలని కోరారు. పై రెండు విషయాలు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు.పాణ్యం నియోజకవర్గంలో క్రొత్త ఓటర్లను నమోదు చేయు కార్యక్రమము ప్రభుత్వం చేస్తుంది , అలాగే రాజకీయ పార్టీలు కూడా క్రొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం చేయాలని డిసెంబర్ 2 మరియు 3 వ తారీకు ల లో జరిగే కార్యక్రమం కు ఎక్కువ సంఖ్యలో క్రొత్త ఓటర్లు వచ్చేలాగా కృషి చేయాలని కోరారు.ఒకే ఫోటోతో నమోదు అయి ఉన్న ఎక్కువ ఓటర్ ల ను , ఒకే పేరుతో ఎక్కువగా ఉన్న ఎక్కువ ఓటరులు, జనాభా ప్రాతిపదికన ఉండవలసిన ఓటర్ల సంఖ్య వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు సుధాకర్ , హనుమంత్ రెడ్డి ,రామ్మోహన్ రెడ్డి సురేష్ , యశ్వంత్ రెడ్డి , పాణ్యం నియోజకవర్గ సూపర్ఇండెంట్ పాల్గొన్నారు.