ప్రమాదంలో గాయపడిన వీఆర్వోకు ఆర్థిక సహాయం
1 min read– మెరుగైన వైద్య చికిత్సలు అందించండి
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఆళ్లగడ్డ మండలంలోని పేరాయపల్లె మెట్ట సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విఆర్ఓ ఆదిలక్ష్మి మెరుగైన వైద్యం కోసం రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ మరియు జిల్లా కలెక్టర్ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బుధవారం స్థానిక ఉదయానంద్ ఆసుపత్రిలో గాయపడిన విఆర్ఓ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ తరపున 3 లక్షల రూపాయలు, జిల్లా కలెక్టర్ గారి తరపున 2 లక్షల రూపాయలు వెరసి మొత్తం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, ఇతర రెవెన్యూ సిబ్బంది అందజేశారు. గాయపడిన విఆర్ఓ కు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆస్పత్రి సిబ్బందిని కలెక్టర్ సూచించారు. ఆళ్లగడ్డ 8వ సచివాలయంలో విఆర్వోగా పనిచేస్తున్న ఆది లక్ష్మి త్వరగా కోలుకోవాలని రెవిన్యూ సిబ్బంది ఆకాంక్షించారు. నంద్యాల ఆర్డిఓ శ్రీనివాసులు, కలెక్టరేట్ రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉదయానంద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీఆర్వోను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.