PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నర్సింగ్ సిబ్బందితో ఓరియంటేషన్ ప్రోగ్రాం

1 min read

ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్,డా.ప్రభాకర్ రెడ్డి  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి హాల్ లో వివిధ విభాగాల నర్సింగ్ సిబ్బందితో ఓరియంటేషన్ ప్రోగ్రాం ద్వారా సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో ఉండే నర్సింగ్ సిబ్బందితో పేషెంట్ కు సంబంధించిన ఓపి మరియు ఐపి విభాగాల్లో ఉండే కేషీట్ ఎలా ఫిల్ చేయాలి  కేషీట్ లో పేషంట్ సంబంధించిన డీటెయిల్స్ పై రెండు రోజులపాటు ఓరియంటేషన్ ప్రోగ్రాం  నిర్వహించి, అనంతరం కార్యక్రమంలో భాగంగా  కేసీట్ పూర్తిగా ఫిల్ చేయాలని నర్సింగ్ సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తూ వారికి కొన్ని సూచనలు తెలియజేశారు.ఆసుపత్రిలోని నర్సింగ్ సిబ్బంది  ఈ హాస్పిటల్ అప్లోడింగ్ ప్రాసెస్ చేసేది ఉంటుందని ప్రతి ఒక్కరు నర్సింగ్ సిబ్బంది కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని త్వరలో పేపర్ లెస్ ప్రక్రియ ఉండనున్నట్లు తెలియజేశారు.పేషంట్కు  సంబంధించిన ఈ హాస్పిటల్ మరియు కేసీట్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని నర్సింగ్ సిబ్బందికి ఆదేశించారు.కేసిట్లో ఎటువంటి తప్పులు లేకుండా ఆధార్ అనుసంధానoగా అడ్రస్ మరియు పేరు పేషంట్కు  సంబంధించిన ప్రక్రియను ఎటువంటి తప్పులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని నర్సింగ్ సిబ్బందికి తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ CSRMO డా.హేమనలిని, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్  G1, శ్రీమతి.వెంకట తులసమ్మ, నర్సింగ్ సూపరింటెండెంట్ G2, శ్రీమతి.నాగమణి, శ్రీమతి.సావిత్రిబాయి, మరియు నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, తెలిపారు.

About Author