PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాల్గవ విడత వైయస్ఆర్ కళ్యాణ మస్తు..

1 min read

షాధీ తోఫా అందుకున్న జంటలు ఆర్థికంగా మరింత ఎదగాలి..

జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి

పల్లెవెలుగు వెబ్ పచిమగోదావరి : వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నాల్గవ విడత క్రింద జూలై – సెప్టెంబరు 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు  రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నుండి వర్చువల్ గా గురువారం ప్రారంభించారు.స్థానిక కలెక్టరేటు నుండి వర్చువల్ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి, శాసన మండలి సభ్యులు వంకా రవీంద్ర నాథ్, సంబంధిత అధికారులు, నూతన వధూవరులు హాజరయ్యి తిలకించారు. జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 383 జంటలకు వైయస్ఆర్ కళ్యాణ మస్తు ఆర్థిక సహాయం రూ.2 కోట్ల 74 లక్షల 40 వేలు  మంజూరు అయ్యాయని ఆమె తెలిపారు. 204 బిసి  జంటలకు ప్రతి జంటకు రూ.50 వేలు చొప్పున రూ.1.02 కోట్లు, 22 బిసి  ఇంటర్ క్యాస్ట్ జంటలకు ప్రతి జంటకు రూ.75 వేలు చొప్పున రూ.16.50 లక్షలు, 11 బిఓసిడబ్ల్యూడబ్ల్యూబి జంటలకు రూ.40 వేలు చొప్పున రూ.4.40 లక్షలు, 5 దివ్యాంగ జంటలకు రూ.1.50 లక్షలు చొప్పున రూ.7.50 లక్షలు, 6 మైనార్టీ జంటలకు ఒక్కొక్క జంటకు ఒక లక్ష రూపాయల చొప్పున  రూ.6.00 లక్షలు,117 ఎస్.సి జంటలకు ఒక్కొక్క జంటకు ఒక లక్ష రూపాయల చొప్పున రూ.1.17 కోట్లు,14 ఎస్.సి ఇంటర్ క్యాస్ట్ జంటలకు రూ 1.20 లక్షలు చొప్పున రూ 16.80 లక్షలు, 3 యస్ టి జంటలకు ఒక లక్ష చొప్పున రూ 3.00 లక్షలు, 1 యస్ టి – ఇంటర్ కాస్ట్ రూ 1.20 లక్షలు చొప్పున 1.20 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. వై.యస్.ఆర్ కళ్యాణ మస్తు, వై.యస్.ఆర్ షాదీ తోఫా పథకాలతో ఆర్థిక కారణాలతో మధ్యలోనే విద్యను ఆపినట్లైతే, తిరిగి చదువు కొనసాగించా లన్నారు.అలాగే పుట్టిన పిల్లలను బాగా చదివించుకునే అవకాశం ఉంటుందని, సామాజిక మార్పులో ఒక విశిష్టమైన పాత్రను పోషిస్తుందని అనడంలో సందేహం లేదని ఆమె చెప్పారు. ఎస్ సి, ఎస్టి, మైనారిటీ, దివ్యాంగులకు, బిసి తదితర వర్గాలకు ఇది ఎంతగానో సహాయంగా ఉంటుందని ఆమె అన్నారు.పథకం ద్వారా లబ్ధిపొంది ఆర్థికంగా, సామాజిక పరంగా అన్ని రంగాలలో  ముందుకు సాగాలని  జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి అన్నారు. జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి, శాసన మండలి సభ్యులు వంకా రవీంద్ర నాథ్ సమక్షంలో నూతన జంటలు ఒకరికొకరు పూల దండలు వేసుకున్నారు. జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి, శాసన మండలి సభ్యులు వంకా. రవీంద్ర నాథ్ లు కలిసి 383 మంది జంటలకు గాను రూ.2 కోట్ల 74 లక్షల 40 వేల నమూనా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు వంకా రవీంద్ర నాథ్, జిల్లా వార్డు,గ్రామ సచివాలయాలు అధికారి కెసిహెచ్ అప్పారావు, సిపివో కె శ్రీనివాస రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు యంయస్ యస్ వేణు గోపాల్, జిల్లా వెనుకబడిన తర గతుల సంక్షేమ శాఖ అధికారి జి గణపతి రావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె  శోభా రాణి, జిల్లా ట్రైబల్ అధికారి డి పుష్ప రాణి, డిపియం టి మురళీ కృష్ణ, జిల్లా సమైక్య అధ్యక్షురాలు పళ్ళెం అరుణ కుమారి, నూతన జంటలు, తదితరులు  పాల్గొన్నారు.

About Author