యాదవులందరూ కలిసికట్టుగా టిడిపి పార్టీ గెలుపుకు కృషి చేయాలి
1 min readవై. నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్జాతీయ బీసీ సంక్షేమ సంఘము జాతీయ కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ బీసీ పోరువాడ లో భాగంగా ఈరోజు కర్నూల్ లోని శ్రీకృష్ణ యాదవ కమిటీ హాలుయందు ఉమ్మడి కర్నూలు జిల్లా అన్ని యాదవ సంఘాల నాయకులతో డాక్టర్ బాలమద్ధయ్య అద్వర్యం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కు ముక్యులుగా తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్ ,తిమ్మయ్య యాదవ్ హాజరు కావడం జరిగింది.ఈ సమావేశంలో వై.నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ:-యాదవులందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని చంద్రబాబు నాయుడుని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని,దానికి అనుగుణంగా మనమందరం కలిసికట్టుగా కృషిచేసి ఈ వైసీపీ నాయకుల అరాచకాలను అక్రమాలను ప్రజలకు వివరిస్తూ, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, గ్రామ గ్రామాన ప్రతి ఇంటి తలుపు తట్టి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను వివరించి, తెలుగుదేశం పార్టీకి గెలుపునకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో యాదవులకు అనేక పదవులను కల్పిస్తే ఆ పదవులను సైతం రెడ్ల సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. జగన్కు సలహాలు ఇవ్వటానికి బీసీలు పనికిరారా? ఈ వైసీపీ రౌడీ మూకలా వలన విచక్షణారహితంగా బీసీ లపై దాడి చేస్తుంటే ఈ ప్రభుత్వం కు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాము.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలి.18-59 సంవత్సరాల మహిళలకు నెలకు రూ.1500/- బ్యాంకు అకౌంట్ లో జమ.తల్లికి వందనం పథకం క్రింద ప్రతి బిడ్డతల్లికి రూ.15,000/- ఆర్థిక సాయం. దీపం పథకం క్రింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితం.1వ తరగతి నుండి B.Tech వరుకు ఉచిత విద్య.రైతు సోదరులకు ఏడాదికి రూ.20,000/- ఆర్థిక సాయం.యువగళం పథకం క్రింద నిరుద్యోగ యువతి, యువకులకు నెలకు రూ.3,000/- నిరుద్యోగ భృతి.ప్రతి ఇంటికి ఉచిత నల్లా( మంచినీరు).మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం.బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం.రానున్న ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు.పూర్ టూ రిచ్ పథకం లాంటి ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ కల్పించే పథకాలు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాడు.ఈ సమావేశంలో బీసీ సెల్ అధికార ప్రతినిధి రాజు యాదవ్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అయ్యన్న యాదవ్,బీసీ సంఘం అధ్యక్షులు శేష పాణి యాదవ్,యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు శేఖర్ యాదవ్, శ్రీకృష్ణ కమిటీ నారాయణ యాదవ్, చల్లా అనుదీప్,నవీన్ యాదవ్, రామ్మోహన్ యాదవ్, యాదవ సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.