NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంచి జరగాలంటే మళ్లీ జగనే రావాలి

1 min read

– పెద్దగోనెహాల్ మరియు యం.డి హళ్లి గ్రామంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం

– మంత్రి తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : కులమతాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ మంచి జరగాలంటే మరోసారి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్ అన్నారు. హోళగుంద మండలం పెద్దగోనెహాల్ మరియు యం.డి హళ్లి గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో యువనేత గుమ్మనూరు ఈశ్వర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇళ్లకు వెళ్లి జగనన్న పాలనలో జరిగిన మంచిని వివరించారు. చంద్రబాబు పాలనలో మర్చిపోయిన హామీలు, జగనన్న పాలనలో అమలు చేసి హామీలను వివరించారు. మరోసారి ముఖ్యమంత్రిగా శ్రీ వైస్ జగన్ ఎందుకు కావాలో వివరించారు. ప్రజల మద్దతు జగన్ గారికి ఉండాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలంటే రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్ అవ్వాలని అన్నారు.కార్యక్రమం అనంతరం వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా,పేద ప్రజల జీవితాలు బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి మరియు ఆలూరుకి మన మంత్రి,నాన్న గుమ్మనూరు జయరాం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ షఫీ,వైస్ జడ్పీ ఛైర్మన్ బావ శేషాప్ప,ఎంపీపీ తనయుడు ఈషా,మండల జేసియస్ కన్వీనర్ మల్లికార్జున,సొసైటీ ఛైర్మన్ మల్లికార్జున,గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి,వెంకట రామి రెడ్డి,ఎంపీటీసీ శివన్న,సచివాలయం కన్వీనర్స్ రంగస్వామి,మర్రి స్వామి, నాయకులు మర్రి స్వామి, రఘు రెడ్డి, పాండు, తిక్క స్వామి, మల్లికార్జున రెడ్డి,శంకర్, వెంకట్ రమణ,యస్ కె.గిరి,దర్గాప్ప సాయిబేస్,ఎంపీటీసీ శివన్న, రామకృష్ణ,ప్రజాప్రతినిధులు మండల నాయకులు, అధికారులు,వైఎస్ఆర్సీపీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author