మోసానికి బలైన కురువ సుగుణమ్మ…లక్ష్మీ లకు న్యాయం చేయాలి
1 min read– మహిళలను ఆర్థికంగా మోసం చేసిన డిఎస్పి మామ కమ్మ వెంకటేశ్వర్లు అతనికి కొమ్ము కాస్తున్న ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పి యుగంధర్ బాబు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో బాధిత మహిళలకు అండగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. కర్నూలు నందలి స్థానిక ధర్నా చౌక్ నందు కమ్మ వెంకటేశ్వర్లు మోసానికి బలైన కురువ సుగుణమ్మ ,లక్ష్మీ లకు న్యాయం చేయాలని కురువ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు ,యం.కె. రంగస్వామి తెలిపారు. మొదటి రోజు రిలే నిరాహార దీక్షలో బాధితురాలు సుగుణమ్మతో పాటు కల్లూరు మండలం మాజీ యం.పి.పి కె.పెద్ద అమీన్, యం.కె.రంగస్వామి,అల్లబాబు ,పుల్లన్న ,వెంకటేశ్వర్లు ,పొన్నకల్ నాగేష్ ,బి .సి .తిరుపాలు ,శ్రీరాములు ,మద్దిలేటి కురువ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తిన కిరణ్ కుమార్ మరియు పుట్లూరు మహేష్ , మధుసూదన్ రాయ, సంగోళీ రాయ సంఘం రంగస్వామి సంఘీభావంగా దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రంగస్వామి మాట్లాడుతూ డిఎస్పి యుగంధర్ బాబు అండతో కురువ మహిళను ఆర్థికంగా మోసం చేసినటువంటి కమ్మ వెంకటేశ్వర్లు అతనికి కొమ్ము కాస్తున్న డిఎస్పి యుగంధర్ బాబులపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టి బాధిత మహిళలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్పీ యుగంధర్ బాబు సర్వీస్ రిజిస్టర్ ని ఒకసారి చెక్ చేస్తే అతను పనిచేసిన ప్రతి చోటా ఎలాంటి చర్యలకు పాల్పడ్డారో గమనిస్తే తెలుస్తుంది అని రంగస్వామి అన్నారు. స్థానిక కలెక్టరేట్ ధర్నాలో ఒక మహిళను ఇష్టం వచ్చినట్లు దూషించిన సంఘటనను మహిళలు ఇంకా మర్చిపోలేదని, అలాగే పాణ్యంలో పనిచేస్తున్న సందర్భంలో ఒక దళిత కానిస్టేబుల్ పై దాడి చేసిన విషయం, అతను ప్రవర్తించిన తీరు అప్పటి యస్.పి సీతారామాంజనేయులు ఆగ్రహానికి గురైన విషయం అందరికీ తెలిసిందేనని ఆయన తెలిపారు. కురువ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తిన కిరణ్ కుమార్ మాట్లాడుతూ బాధిత మహిళకు ఏదైతే పొలం అమ్ముతానని కమ్మ వెంకటేశ్వర్లు చెప్పాడో అదే పొలాన్ని డిఎస్పీ తన భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈరోజు బాధిత మహిళ సుగుణమ్మకి మరొక బాధితురాలు లక్ష్మీకి అన్యాయం చేశారని, మహిళలను ఆర్థికంగా మోసం చేసి ఆర్థిక నేరాలకు పాల్పడిన డిఎస్పీ యుగంధర్ బాబును తక్షణమే విధుల నుంచి తొలగించి ఆపై విచారణ జరిపించాలని అతను జిల్లా పోలీసు ఉన్నతా ధికారులను కోరారు. బాధిత మహిళలకు న్యాయం జరగని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్నం రాజేశ్వరి, శేషఫణి, నక్కలమిట్ట శ్రీనివాసులు,నంది విజయలక్ష్మీ , భారతమ్మ , 8 వ వార్డు కార్పొరేటర్ పరమేశ్వరులు,సింధు నాగేశ్వరరావు యాదవ్, బహుజన సమాజ్ పార్టీ నాయకులు మౌలాలి, చిరంజీవి, రాయలసీమ విద్యార్థి యువజన సంఘం నాయకులు వి.వి. నాయుడు, బెస్త వెంకటేశ్వర్లు,ఆత్మకూరు న్యాయవాది రాంప్రసాద్, డోన్ న్యాయవాది లక్ష్మన్న , కురువ సంఘం అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.