NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను పాటించండి..

1 min read

డిశంబరు 2,3 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..

జిల్లాకలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లా ఓటరు జాబితా సాధనపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలునందు రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏలూరు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ హాజరై జిల్లాకు సంబంధించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ రోజున పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ప్రత్యేకంగా 30 రోజులకు పైగా పెండింగ్‌ లో ఉన్న ఫారమ్‌లు మరియు ఎస్ఎస్ఆర్- 2024 సమయంలో స్వీకరించిన ఫారమ్‌లు,  అనోమలిస్ పెండింగ్, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, పెండింగ్ రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఈరోల్‌ పై రిపోర్ట్ లు, ఎపిక్ కార్డుల జనరేషన్ & పంపిణీ, పీఎస్ఈలు, డీఎస్ఈలు, తదితర అంశాలపై ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఎన్నికల అధికారికి వివరించడం జరిగింది.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఉద్ధేశించి మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమంపై డిశంబరు 2,3 ప్రత్యేత ఓటరు నమోదు కార్యక్రమాన్ని జిల్లా అంతటా నిర్వహించి ఇంకా అర్హత కలిగివున్న ఓటర్లను గుర్తించి నమోదు చేయించి నాణ్యమైన ఓటరు జాబితాను చేపట్టాలని తెలిపారు.  ఎట్టి పరిస్ధితుల్లోను ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి బూత్ లెవల్ ఆఫీసర్స్ తమ బూత్ లలో ఆతేదీల్లో ఉండి నమోదు ప్రక్రియను చేపట్టాలని విధులలో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.   ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంధ్రన్, డిఆర్ఓ యం. వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఈఆర్ఓలు కె. బాబ్జి, సత్యనారాయణమూర్తి, గీతాంజలి, తహశీల్దారు సోమశేఖర్, సిపిఓ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ చల్లన్న దొర తదితరులు పాల్గొన్నారు.

About Author