బీజేపీ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం
1 min read– కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్ మీసాల ప్రేమ్ కుమార్
పల్లెవెలుగు వెబ్ కోడుమూరు: కోడుమూరు పట్టణంలోని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు శుక్రవారం ఉదయం నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సూచనల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు కోడుమూరు పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల ముఖ్య నాయకులు శక్తి కేంద్ర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు శ్రీ కునిగిరి నీలకంఠ పాల్గొని ముందుగా భరతమాత శ్యాం ప్రసాద్ ముఖర్జీ మరియు పండితుల చిత్రపటాలకు పూలమాలలు అర్పించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ మండల నాయకులు పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేయాలని అహర్నిశలు పార్టీ కొరకు పని చేస్తూ బూతు స్థాయి కమిటీలను నిర్మాణం చేసి ప్రజా సమస్యల కొరకు పోరాడుతూ ప్రజలతో మమేకమై సమస్యలపై ధర్నాలు నిరాహార దీక్షలు పోరాటాలు మరియు ఉద్యమాలు జరిపి ప్రజా సమస్యల పోరాటం చేసి పార్టీపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఉపదేశించారు కోడుమూరు కన్వీనర్ శ్రీ మీసాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గతంలో పూడూరు పడిదంపాడు రోడ్డు సమస్యపై పోరాడి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించామని అనేక రకాల ప్రజా సమస్యలపై పోరాడి పార్టీని ఇప్పటివరకు నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన బూతు స్థాయిలో పార్టీని తీసుకెళ్లామని వివరించారు ప్రజా సమస్యలకు నిరంతరం ఎప్పుడు ప్రజల్లోనే మమేకమై ఉంటామని వచ్చే ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గంలో పార్టీ జెండాను ఎగరవేసి అధికారాన్ని చేదికించుకుంటామని వివరించారు అనంతరం జిల్లా అధ్యక్షులు శ్రీ కునిగిరి నీలకంఠ మరోసారి కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీ మీసాల ప్రేమ్ కుమార్కి శాలువా కప్పి సన్మానం చేశారు ఈ సమావేశంలో కోడుమూరు నియోజకవర్గ మండలాల అధ్యక్షులు కోడుమూరు నియోజకవర్గ మాజీ కన్వీనర్ సద్దల మధు కిషోర్ కోడుమూరు మండల ఇన్చార్జ్ ఉపేంద్ర కోడుమూరు మండల అధ్యక్షుడు సల్వాడి సురేంద్ర గూడూరు రూరల్ మండల అధ్యక్షుడు బట్టు రాజశేఖర్ అర్బన్ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ కర్నూల్ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అనంత్ సి.బెళగల్ మండల అధ్యక్షులు దేవన్న అన్ని మండలాల ప్రధాన కార్యదర్శులు శక్తి కేంద్ర ప్రముఖులు మరియు కోడుమూరు నియోజకవర్గ కో కన్వీనర్ వేల్పుల గోపాల్ రాష్ట్ర ఓబిసి మోర్చా ఇంచార్జ్ మురళి నాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వర్ యాదవ్ కోడుమూరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.