పేద ప్రజల జీవితాలు బాగుపడాలన్నా మళ్ళీ జగనన్నే సీఎం కావాలి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: సంక్షేమం,అభివృద్ధి లో రాష్ట్రాన్ని సీఎం జగన్ ఆదర్శంగా నిలిపారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తనయుడు యువనేత గుమ్మనూరు ఈశ్వర్ అన్నారు. శుక్రవారం హోళగుంద మండలం గజ్జెహళ్లి గ్రామంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కు సీఎం జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా గుమ్మనూరు ఈశ్వర్ పాల్గొన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో వివిధ పథకాల ద్వారా జరిగిన అభివృద్ధిని తెలిపే బోర్డ్ ను గుమ్మనూరు ఈశ్వర్ ప్రారంభించి ఏఏ పథకం ద్వారా ఎంతమేలు జరిగిందో ప్రజలకు వివరిస్తూ.ఈ సచివాలయం పరిధిలో మొత్తం కలిపి రూ 28,12,15,748 లబ్ది అందిందని,పథకాల వారీగా ఈ వివరాలు ను వివరించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా,పేద ప్రజల జీవితాలు బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి మరియు ఆలూరుకి మన మంత్రి,నాన్న గుమ్మనూరు జయరాం కావాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ షఫీ,వైస్ జడ్పీ ఛైర్మన్ బావ శేషాప్ప,ఎంపీపీ తనయుడు ఈషా,మండల జేసియస్ కన్వీనర్ మల్లికార్జున,సొసైటీ ఛైర్మన్ మల్లికార్జున,వైస్ ఎంపీపీ కేంచప్ప, సచివాలయం కన్వీనర్ హిమాం, ఉసేని దస్తగిరి,మాజీ సర్పంచ్ బీమాలింగప్ప,సర్పంచ్ గిరిమల్ల,డీలర్ మలేష్ గోపాల్ యస్ కె.గిరి,దర్గాప్ప సాయిబేస్,ఎంపీటీసీ శివన్న, రామకృష్ణ,తాలూకా సోషల్ మీడియా కో- కన్వీనర్ మౌనేష్, ప్రజాప్రతినిధులు మండల నాయకులు, అధికారులు,వైఎస్ఆర్సీపీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.