కోట బాలుర ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలోని కోట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం ముందస్తు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. డా : బీ.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం 1949 నవంబర్ 26 న సమర్పించబడి ఆమోదించబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబరు 26 వ తేదీన “రాజ్యాంగ దినోత్సవం” నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో రాజ్యాంగ ప్రవేశిక (ప్రింబుల్) ను సామూహిక పఠనం (మాస్ రీడింగ్)చేయించాలని ఆదేశాలతో ఉదయం పాఠశాల ప్రార్థన సమయంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్ పెరుమాళ్ళ విద్యార్థులతో రాజ్యాంగ ప్రవేశిక ను సంయుక్త పఠనం చేయించారు.అనంతరము బోధన, బోధనేతర సిబ్బంది భారత రత్న,రాజ్యాంగ నిర్మాత “డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్” చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ గొప్పతనం గురించి, వారి వల్ల మనం పొందిన రాజ్యంగ ఫలాలను గురించి, వారు భారతదేశానికి చేసిన సేవలను గురించి పాఠశాల సోషియల్ ఉపాధ్యాయులు వెంకట రమణ గారు విద్యార్థులకు చక్కగా వివరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సలీం భాష గారు విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాలమ్మ, అరుణా విజయ భారతి,లలితమ్మ, సరోజిని దేవి, షంషాద్ బేగం, వెంకటేశ్వర్లు, నాగశేషులు, రామిరెడ్డి, నాన్ టీచింగ్ స్టాఫ్ మురళీ కృష్ణ , పాములేటమ్మ తదితరులు పాల్గొన్నారు.