“అన్నదానంతో ఆత్మ సంతృప్తి” అమీన్ భాయ్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: మన దేశంలో నేటికి కొన్ని ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు ఆకలితో అలమటీస్తూన్నారనీ, అన్నదానంతోనేఆత్మసంతృప్తి కలుగుతుందని,వందల మంది ఆకలితో చనిపోతున్నారని,,ఉన్నవారు ఒక పూట భోజనం లేని వారికి అందించడం ద్వారా ఆకలి చావులు ఉండవుని, పారిశ్రామికవేత్త ఏ -1 చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అమీన్ బాయ్ అన్నారు. స్థానిక విజయవాడ కృష్ణా బ్యారేజ్ వద్ద శుక్రవారం జరిగిన అమీన్ భాయ్ ఆధ్వర్యంలో వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరిగింది..ఈఅన్నదాన కార్యక్రమములో ఆయన మాట్లాడుతూ ఆకలి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కొన్ని ప్రాంతాల్లో చూసాము. మన భారతదేశాన్ని అన్నపూర్ణగా పిలుస్తారు నిత్యం పాడిపంటలతో, కలకలలాడే మన దేశంలో ఆకలి చావులు కనిపించడం ఎంతో బాధాకరం, అన్నారు. అందుకే నేను సైతం, అంటూ మా ఏ_1 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఆయన చెప్పారు .ఆకలి చావులేని భారతదేశం కోసం ,నా వంతు కృషి చేస్తానన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ మరియు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలుసునని, నిత్య అన్నదానం కొరకు విరాళాలు ఇవ్వదలచిన దాతలు, 8 9 8 5 5 45 955 ఈ నెంబరుకు ఫోన్ పే, మరియు పేటీఎం ,గూగుల్ పే, ద్వారా మీ వంతు సహకారం అందించగలరని, అమీన్ బాయ్. కోరారు. ఈ కార్యక్రమంలో రూప్ నాధ్ , ముస్తాక్ భాయ్,, రఫీ భాయ్,, మహేష్ , తదితరులు పాల్గొన్నారని ఆమిన్ బాయ్,ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.