తెలుగు అధ్యాపకురాలుకు జాతీయ అవార్డు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలు అధ్యాపణలుగా పనిచేస్తున్న నందికొట్కూరు వాసి డా. మల్లెపోగు వెంకటలక్ష్మమ్మ కు విమల సాహితీ జాతీయ పురస్కారం దక్కింది. ఈ నెల 19వ తేదిన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రములో “విమలసానితి జాతీయ పురస్కారంను ఆమె అందుకున్నారు. ఈ పురస్కారం ” విమల సాహితీ” పత్రికా సంపాదకులు అమ్మగారి జ్ఞాపకార్థంగా పత్రికను స్థాపించి, దానిని నలుగురు మహిళలచేత నడిపిస్తున్నారు. డా. మల్లి పోగు వెంకట లక్ష్మమ్మ గౌరవ సలహారదారు రాలు పని చేస్తున్నారు. పత్రికలో వారం వార వచ్చే “గుర్తు చేసుకుందాం” శీర్షికలు తప్పనిసరిగా ఒకవ్యాసం వస్తుంది. ఆ వ్యాసం వీరే రాస్తున్నందున . మరియు నవల పత్రిక సమీక్ష వ్యాసాలు కూడ రాసి పత్రికను ముందకు నడిపించేందుకు కృషి చేస్తున్న వారికి ఈ అవార్డును ప్రధానం చేయడం జరిగింది. అవార్డు ను పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇశాన్ , ప్రముఖ వాగ్గేయకారులు, గోరేటి వెంకన్న, ప్రముఖ కవి కోటేశ్వరరావు. పత్రికా వ్యవస్థాపకులు డా.విద్యాధర్ చేతులమీరుగా అందుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.శశి కళ , అకాడమిక్ కో ఆర్డినేటర్ డి. వెంకటేశ్వర్లు , అధ్యాపకులు, విద్యార్థులు అవార్డు గ్రహీత కు అభినందనలు తెలియజేశారు.