PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కే.సి అధికారుల నిర్లక్ష్యంతో చేతికొచ్చిన మినపంట నీళ్లపాలు…

1 min read

– 3 లక్షల రూపాయల  పంటనష్టం…

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  కే.సి కెనాల్ అధికారుల నిర్లక్ష్యంతో చేతికి వచ్చిన మినుము పంట నీళ్ల పాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చిందుకూరు.గ్రామానికి చెందిన మాను కింది నాగశేషులు రెండు ఎకరాల 75 సెంట్లు పొలంను కౌలుకు తీసుకున్నాడు. 75 రోజుల క్రితం పొలంలో మినుముల పంట వేశాడు . పంట కోతకు సిద్ధంగా ఉన్న తరుణంలో గత 20 రోజుల నుండి కేసీ కెనాల్ నుండి నీరు విడుదల చేయడంతో కాలువ పైకెక్కి నీరు పారి రైతు నాగశేషులు పొలంలో మోకాళ్ళ లోతు నిలువ ఉండడంతో, పంట బూజు పట్టి చెడిపోతుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెసర వాయి తూము వద్ద పలుమార్లు లస్కర్లకు  ఒక్క అడుగు తగ్గించి నీటిని విడుదల చేయమని కోరగా పెసర వాయి తూము వద్ద కరిమద్దేల తూమును మూసివేసి చిందుకూరు పై గ్రామాలైన గడిగరేవుల, తిరుపాడు గ్రామాల పొలాల కొరకు అధిక నీటిని విడుదల చేయడంతో చింతూరు గ్రామ పొలాల కాల్వ వద్ద కాలువ లో నుంచి కోపు ఎక్కి పారి పొలాలలో నీరు నిల్వ ఉండడంతో చేతికొచ్చిన పంట నీళ్ల పాలవుతుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . పొలానికి కవులు 75000, పెట్టుబడి లక్ష 35000 మొత్తం ఇప్పటికే 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని, మూడు లక్షల రూపాయల పంట నీలపాలు అవుతుంటే, పట్టించుకునే నాధుడే కరువయ్యారని, అధికారులు ఆదేశించారని లష్కర్లు మాట వినకపోవడంతో ఇంత పంట నష్టం జరుగుతుందని రైతులు వాపోయారు . ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని పెసరవాయి తూము వద్ద ఒక్క అడుగు కిందికి నీటిని విడుదల చేస్తే రైతుల పొలాల్లో నీరు పారకుండా ఉంటుందని అన్నారు.

About Author