PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవకులకు.. ఘనసన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, ప్యాపిలి:వృత్తిరీత్యా ప్రజలకు చేసిన సేవలు మరువలేమని,భవిష్యత్​లో మరింత సేవ చేయాలని సూచించారు ప్యాపిలి సర్కిల్​ ఇన్​ స్పెక్టర్​ రామలింగయ్య. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్తున్న పోలీస్​ అధికారులను సీఐ నేతృత్వంలో మంగళవారం రాత్రి ఘనంగా సన్మానించారు. బదిలీ పైన వెళ్లిన ప్యాపిలి ఎస్ఐ మరుతి శంకర్ , జలదుర్గం ఎస్ ఐ మరుతి శంకర్, ప్యాపిలి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి మండల ప్రజలకు చేసిన సేవలు అద్వితీయమన్నారు. అనంతరం సీఐ రామలింగయ్య బదిలీపై వెళ్తున్న వారికి శాలువాలు కపి పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్యాపిలి ఎస్ఐ సిఎం రాఖేష్, జలదుర్గం ఎస్ఐ నరేష్ ,రాచర్ల ఎస్ఐ భూపాలుడు, కానిస్టేబుల్ శ్రీనివాసులు, లక్ష్మీన్న, పరమేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. .

About Author