NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బర్రెలక్క శిరీషకు మద్దతు తెలిపిన పీపీఎస్,ఆర్వీపీఎస్ నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీష అలియాస్ బర్రెలక్కను గెలిపించాలని కోరుతూ ప్రజా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బలరాం,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ లు స్వతహాగా కరపత్రాలు ముద్రించి కొల్లాపూర్ నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజక వర్గంలో ప్రజలు శిరీష బర్రెలక్కకు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు తెలిపారు  శిరీష ఎమ్మెల్యే అభ్యర్థిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో నామినేషన్ వేసినప్పటినుండి వివిధ పార్టీల వారు అనేక ప్రలోభాలకు గురిచేస్తున్న ఏమాత్రం లోనవక ప్రజల కోసం పనిచేస్తానంటూ ముందుకు కదిలిన ధైర్యవంతురాలు శిరీషకు అండగా నిలవడం ప్రజాసంఘాల బాధ్యతగా తాము భావిస్తున్నామని డబ్బు మద్యానికి చోటు లేకుండా నిజాయితీగా పనిచేస్తున్న శిరీషకు ప్రజలు కూడా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు శిరీష గెలవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కి పట్టం కట్టినట్టు అవుతుందని దేశ పౌరులు ఎవరైనా రాజకీయాలలో పోటీ చేయవచ్చునని సంకేతాన్ని మరొకసారి ఇచ్చినట్లు అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి కర్నూలు జిల్లా అధ్యక్షులు అశోక్ ప్రజా పరిరక్షణ సమితి నాయకులు ఎస్ఎం భాష పాల్గొన్నారు.సామాజిక ఉద్యమాభివందనాలతో.. రాయలసీమ విద్యార్థి పోరాట సమితిRVPS.

About Author