పుష్పగిరి క్షేత్రంలో..అఖండ దీపోత్సవం..
1 min readఘనంగా పంచ నదీహారతి
- ప్రత్యేక పూజలు చేసిన శ్రీ విరజానంద స్వామి
- జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు..
పల్లెవెలుగు, వల్లూరు:రెండవ దక్షిణ కాశీగా వెలుగుందిన పుష్పగిరి పుణ్యక్షేత్రం ఆదివారం రాత్రి కార్తిక పౌర్ణమి సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది కార్తీక దీపాలతో ఆలయం శోభాయమానంగా వెలుగుతోంది అధిక సంఖ్యలో మహిళా భక్తులు కార్తీక పౌర్ణమి ఉత్సవంలో పాల్గొని ప్రమిదలు వెలిగించారు, ఆలయం కొండపై అఖండ జ్యోతిని బ్రహ్మగారి మఠం అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరజానంద స్వామి చేతుల మీదుగా వెలిగించారు, ఈ కార్యక్రమాలన్నీ గిరి ప్రదక్షణ వ్యవస్థాపకుడు ప్రముఖ న్యాయవాది సట్టి భారవి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు, నదిలో కూడా మహిళలు కార్తీక దీపాలు వెలిగించి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సంతానమల్లేశ్వర స్వామి ఆశీస్సులకు పాత్రులయ్యారు, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు, పుష్పగిరి క్షేత్రం పెన్నా నది ఒడ్డున కార్తీక దీపోత్సవం గంగా హారతిని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆశ రేఖ ఫౌండేషన్ చైర్ పర్సన్ నాగవేణి అన్నారు, కడప నుంచి పుష్పగిరి పుణ్యక్షేత్రానికి భక్తుల కోసం మూడు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు, అలాగే కళాకారుడు కళ్యాణ్ బృందం పుష్పగిరి ఆలయం నందు వేసిన శివుని రంగుల బొమ్మలు ఆకట్టుకున్నాయి.