పోరాటాలతోనే.. సమస్యకు పరిష్కారం..
1 min readఏపీఎన్జీఓ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు వెంగళ్ రెడ్డి
పల్లెవెలుగు, కర్నూలు:పోరాటాలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని హితవు పలికారు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ వెంగళ్ రెడ్డి. ఆదివారం ప్రభుత్వ ఉద్యోగుల నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశాన్ని వ్యవసాయ శాఖ ఆవరణలోని క్లాస్ ఫోర్ అసోసియేషన్ బిల్డింగ్లో ఏపీఎన్జీఓ నగర అధ్యక్షుడు కాశన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగళ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల సాధనకు సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏ సమస్య వచ్చినా సమన్వయంతో చర్చించి… పరిష్కారం దిశగా ముందుకు సాగాలన్నారు. నాల్గవ తరగతి ఉద్యోగుల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మూడో సారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్.మద్దిలేటిని ప్రశంసించారు. అనంతరం ఏపీ ఎన్జీఓ నగర అధ్యక్షుడు కాశన్న మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటమే.. ఏకైక మార్గమని సూచించారు. ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా .. తమను సంప్రదిస్తే పరిష్కారానికి నిత్యం కృషి చేస్తామన్నారు. భవిష్యత్లో ఎదురయ్యే సమస్యలపై నాల్గవ తరగతి ఉద్యోగుల నూతన కమిటీ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు ప్రతిఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని ఏపీ ఎన్జీఓ నగర అధ్యక్షుడు కాశన్న ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
నాల్గవ తరగతి ఉద్యోగుల నూతన జిల్లా కమిటీ :
అధ్యక్షులుగా ఈ.మద్దిలేటి, అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఫయాజ్ బాష, వైస్ ప్రెసిడెంట్ వి. లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ సి. వెంకటేశ్వర్లు, జిల్లా సెక్రటరీ సిహెచ్ భాస్కర్ రెడ్డి, జాయింట్ సెక్రటరి ఎన్.రవిరాజు, జాయింట్ సెక్రటరి బి. రాముడు, ఆర్గనైజింగ్ సెక్రటరి కె. సుధాకర్, ట్రెజరర్ డిఎండీ షబీర్ తదితరులను సభ్యులుగా ఎన్నుకున్నారు.