సీపీఐ సేవలు.. ఆదర్శం
1 min read– పేదలకు అల్పాహారం, మాస్కులు, విద్యార్థులకు పెన్నులు, పలక పంపిణీ
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: మనిషి సంపాదించిన దాంట్లో కొంత పేదలకు వెచ్చించాలని, అందులోనూ కష్టకాలంలో ఉన్న వారికి సేవ చేస్తే మరింత సంతోషంగా ఉంటుందని సీపీఐ జిల్లా నాయకులు రఘు, రామ్మూర్తి, రమేష్ బాబు అన్నారు. మంగళవారం జూపాడు బంగ్లా మండల కేంద్రంలోని సిద్దేశ్వరం రామసముద్రం మాజారా గ్రామాలలో పేద ప్రజలకు అల్పాహారం, మాస్కులు, శానిటైజర్ పేద విద్యార్థులకు బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సిద్దేశ్వరం,రామసముద్రం మజారా గ్రామాలు కావడం వల్ల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పేదవాళ్ళు మరింత పేదలుగా మారారని, కనీసం గిరిజనులకు ఉండడానికి ఇల్లు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సిద్ధేశ్వరం, రామసముద్రం గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో AISF రాష్ట్ర సమితి నాయకులు శ్రీనివాసులు, హెల్త్ అసిస్టెంట్ రాముడు, పా రుమాంచాల గ్రామ వైసిపి నాయకులు దేవ సహాయం, రంగస్వామి, పంచాయితీ కార్యదర్శి కృష్ణరెడ్డి,సీపీఐ నాయకులు నరసింహ, వైహిడుద్దీన్, ప్రదీప్, ఎల్లయ్య, గ్రామస్తులు నరేష్, అంగన్వాడీ, ఆశ, వర్కర్స్ పాల్గొన్నారు.