4న బిసివై పార్టీ జాతీయ అధ్యక్షులు కర్నూలు జిల్లాలో పర్యటన
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: డిసెంబర్ 4న బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కర్నూలు జిల్లాలో పర్యటించినున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త రాచ కౌలుట్ల యాదవ్ తెలిపారు.హోలగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో దర్గాను దర్శించుకునేందుకు 4వ తేదీ సాయంత్రం 3:00 గంటలకు ఆయన చేరుకుంటారని తెలిపారు. మండలంలోని ప్రజలు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని తప్పెట్లు మేళతాళాలు గజ పూలమాలతో స్వాగతం పలికేందుకు జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు అర్జున్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర సమన్వయ సారధి రాచ కౌలుట్ల యాదవ్ తెలిపారు. దర్గాను దర్శించుకున్న అనంతరం అక్కడినుంచి నేరుగా ఆదోని పట్టణానికి చేరుకుంటారని అన్నారు. అందులో భాగంగానే మంత్రాలయం ఎమ్మిగనూరు ఆదోని కోడుమూరు ముఖ్యమైన కీలక నేతలు పార్టీ అధ్యక్షులు బోడె రాంచంద్ర యాదవ్ గారితో భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. మరుసటి రోజు డిసెంబర్ 5 వ తేదీన ఆలూరు నియోజవర్గం ఆలూరు పట్టణానికి సమీపంలోని బేల్లే గుండాఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో ఆ నియోజకవర్గం భారత చైతన్య యువజన పార్టీ నాయకులు మోహన్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న BC SC ST మైనారిటీ ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ చీఫ్ శ్రీ బోడె రాంచంద్ర యాదవ్ గారు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని బీసీవై పార్టీ జిల్లా సమన్వయ సారదులు,నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు బీసీ ఎస్.సి ఎస్.టి మైనారిటీ నాయకులు,ప్రజలు, సమ్మెలన సభలో భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయ సారధి రాచ కౌలుట్ల యాదవ్ విజ్ఞప్తి చేశారు.