ఆల్ టైం హై నుంచి రివర్స్ అయిన నిఫ్టీ- 50
1 min readపల్లెవెలుగు వెబ్: స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం పాజిటివ్ గా ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ.. తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో కూడ నష్టాల పరంపర కొనసాగుతోంది. అమెరికా, ఆసియా, యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లు కూడ నష్టాల బాటపట్టాయి. నిఫ్టీ-50 ఆల్ టై హైని చేరుకోవడంతో.. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారని చెప్పవచ్చు. దీంతో మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. మధ్యాహ్నం 1: 40 నిమిషాల సమయంలో నిఫ్టీ .. 78 పాయింట్ల నష్టంతో 15,790 వద్ద ట్రేడ్ అవుతుండగా.. బ్యాంక్ నిఫ్టీ 260 పాయింట్ల నష్టంతో 34, 980 వద్ద ట్రేడ్ అవుతోంది.